పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మధురమైన జ్ఞాపకం అన్న విషయం తెలిసిందే. జీవితాంతం తనను అర్థం చేసుకొని కష్టసుఖాల్లో తోడునీడుగా ఉండే భాగస్వామి దొరకాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటూ ఉంటారు. ఇక నిజంగా కోరుకున్నట్లుగానే అర్థం చేసుకునే భాగస్వామి దొరికితే తమకంటే అదృష్టవంతులు ఇంకెవరూ లేరు అని చెబుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కానీ ఇటీవల కాలంలో మాత్రం జనాలు పెళ్లి అర్థాన్ని మార్చేస్తున్నారు. మామూలుగా అయితే జీవితంలో ఒక మంచి తోడు కోసం పెళ్లి చేసుకోవడం చేస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో కొంతమంది ఏకంగా ఒక పెళ్లితో ఆగడం లేదు. రెండు మూడు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఇంకొంతమంది అయితే నిత్య పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు గానే మారిపోయి ఇక పెళ్లినే ఏకంగా వ్యాపారంగా మార్చుకుంటూ మోసాలకు పాల్పడుతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇలా నేటి రోజుల్లో పెళ్లి విషయంలో కొంతమంది వ్యవహరిస్తున్న తీరు మాత్రం అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక్కడ మరో విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా ఒక వ్యక్తి సొంత కూతురుతో పాటు మరో 20 మంది మహిళలను పెళ్లి చేసుకున్నాడు.


 ఈ దారుణమైన ఘటన యూఎస్ లో చోటు చేసుకుంది అని చెప్పాలి. కలారాడో నగరానికి చెందిన శ్యామ్యూల్ అనే ఒక మత బోధకుడు. తన సొంత కూతురు తో పాటు 20 మంది యువతులను పెళ్లి చేసుకున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఇటీవల అతన్ని ఎఫ్బిఐ అరెస్టు చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. శామ్యూల్ తనను తాను ఒక ప్రవక్తగా ప్రకటించుకున్నట్లు ఎఫ్బిఐ తన నివేదికలో పేర్కొంది. అంతే కాదు అతను పెళ్లి చేసుకునే వారిలో ఎక్కువ మంది మైనర్లే ఉన్నట్లు గుర్తించాలి అధికారులు. ఈ ఘటన కాస్త సంచలనంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nri