అయితే ఇటీవల కాలంలో ఏకంగా విషపూరితమైన పాములు జనావాసాల్లోకి వస్తూ ఉన్న గతంలో వెలుగులోకి వస్తున్నాయ్. దీంతో ఎంతోమంది పాము కాటుకు గురవుతున్నారు. కొంతమంది సరైన సమయంలో ఆసుపత్రికి వెళ్లి ప్రాణాలతో బయటపడుతుంటే ఇంకొంతమంది చివరికి పాము కాటుకు బలవుతున్నారు అని చెప్పాలి. ఇటీవల ఆస్ట్రేలియాలోని సెంట్రల్ క్వీన్స్ ల్యాండ్ లో కూడా ఇలాంటి విషాదకర ఘటన చోటుచేసుకుంది. విషసర్పం నుంచి స్నేహితున్ని కాపాడటానికి ప్రయత్నించిన.. ఒక వ్యక్తి చివరికి అదే పాము కాటుకు బలయ్యాడు.
ఇద్దరు సీనియర్ సిటిజన్స్ సెంట్రల్ క్వీన్స్ ల్యాండ్ లో ఉన్న కౌమాల స్టేస్ స్కూల్ శతాబ్ది వేడుకల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే స్నేహితుడి పాదాలకు పాము చుట్టుకోవడాన్ని 69 ఏళ్ల వృద్ధుడు గమనించాడు. ఈ క్రమంలోనే ఆ విష సర్పం నుంచి అతని కాపాడాలి అని భావించాడు. దీంతో ఇక పామును అతని కాలు నుంచి వేరు చేయడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే పాము అతని చేయితోపాటు ఛాతి మీద పలుసార్లు కాటు వేసింది. అయినప్పటికీ పట్టు విడువని అతను పామును స్నేహితుని కాలి నుంచి వేరు చేసి పక్కకు పడేసాడు. అయితే అప్పటికే విషం అతని శరీరం మొత్తం పాకింది. దీంతో కార్డియాక్ అరెస్ట్ కావడంతో అక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. ఇకఅతనికి సిపిఆర్ చేసిన ఫలితం లేకుండా పోయింది. ఆసుపత్రికి తరలించే లోపే చివరికి ప్రాణాలు కోల్పోయాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి