నితిన్..ఒకప్పుడు వరుస సినిమాలతో తన హవా కొనసాగించిన ఈయన ప్రస్తుతం వరుస డిజాస్టర్స్ తో మార్కెట్ మొత్తం కోల్పోయారు.జయం,సై, దిల్, గుండెజారి గల్లంతయ్యిందే,ఇష్క్,భీష్మ వంటి సినిమాలతో ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నితిన్ కి ప్రస్తుతం టాలీవుడ్ లో మార్కెట్ మొత్తం పడిపోయిందని చెప్పుకోవచ్చు.అయితే ఈయన ఈ మధ్యకాలంలో చేసిన సినిమాలన్నీ వరుస ఫ్లాప్ లు,డిజాస్టర్స్ అవుతున్నాయి. ముఖ్యంగా భారీ అంచనాలతో వచ్చిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద దెబ్బేయడంతో నితిన్ సినీ కెరియర్ ఆగమ్య గోచరంగా తయారైంది. ఈ మధ్యకాలంలో నితిన్ నటించిన రాబిన్ హుడ్, తమ్ముడు, మాచర్ల నియోజకవర్గం, రంగ్ దే, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ వంటి సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. దీంతో నితిన్ అభిమానులు కూడా చాలా నిరాశలో మునిగిపోయారు. 

ఇక మధ్యకాలంలో బలగం వేణు తో ఎల్లమ్మ మూవీ లో హీరోగా చేస్తున్నట్టు వార్తలు వినిపించాయి.కానీ ఈ సినిమా నుండి కూడా నితిన్ తప్పుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం తన కెరీర్ మళ్ళీ గాడిన పడాలంటే ఆ సినిమాకు సీక్వెల్ చేయాల్సిందేనని నితిన్ భావిస్తున్నారట.అదేంటంటే నితిన్ నటించిన కల్ట్ క్లాసిక్ మూవీ ఇష్క్.. నితిన్,నిత్యమీనన్ హీరో హీరోయిన్లుగా విక్రమ్ కుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ కొట్టింది. అంతే కాదు ఈ సినిమా మ్యూజికల్ గా కూడా హిట్ అయింది. ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన అనూప్ రూబెన్స్ సంగీతం అద్భుతంగా ఉండడంతో ఈ సినిమా పాటలకి ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు. అయితే అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ రాబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ మధ్యనే నితిన్ తో కలిసి అనూప్ రూబెన్స్ దిగిన పిక్చర్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వీరిద్దరూ ఇష్క్-2 మ్యూజిక్ సెట్టింగ్ కోసం కూర్చున్నారనే వార్తలు వినిపించాయి.

అయితే ఈ విషయం వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్స్, నితిన్ ఫాన్స్ వద్దు బాబోయ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఎందుకంటే ఇష్క్ వంటి భారీ హిట్ ని మళ్లీ ముట్టుకోవడం ఎందుకు.. ఆ కల్ట్  క్లాసిక్ మూవీ ని టచ్ చేయకపోవడమే మంచిది.. ఒకవేళ నిత్యమీనన్ నితిన్ హీరో హీరోయిన్లుగా విక్రమ్ కుమార్ డైరెక్షన్లో సినిమా వచ్చినా కూడా దానికి ఇష్క్-2 అని కాకుండా వేరే సినిమా పెట్టుకోండి ఇష్క్ -2 ని టచ్ చేసి ఆ సినిమా వాల్యూ పోగొట్టకండి అంటూ కామెంట్లు పెడుతున్నారు. దానికి కారణం ఈ మధ్యకాలంలో నితిన్ చేసిన సినిమాలన్నీ డిజాస్టర్ అవ్వడమే. ఒకవేళ ఇష్క్ సీక్వెల్ అని చెప్పి ఇష్క్-2  తీస్తే ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయితే మాత్రం ఇష్క్ సినిమాకి ఉన్న క్రేజ్ మొత్తం పడిపోతుందనే ఉద్దేశంతోనే అభిమానులు ఆ కల్ట్  క్లాసిక్ మూవీ ని టచ్ చేయకండి అంటూ కామెంట్లు పెడుతున్నారు.మరి నిజంగానే నితిన్ ఇష్క్ 2 మూవీ చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: