అయితే, ఇండస్ట్రీ టాక్ ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్‌గా మొదటగా త్రిషను అనుకున్నారట. గత కొంతకాలంగా త్రిష వరుసగా మంచి మంచి చిత్రాలు సెలెక్ట్ చేసుకుంటూ, తన ఖాతాలో క్రేజీ హిట్స్‌ను నమోదు చేసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా త్రిష పాత్రకు బాగా సూట్ అవుతుంది అని భావించి, ఆమెను ఈ ప్రాజెక్ట్ కోసం సంప్రదించారట. కథను కూడా వివరంగా చెప్పి, పాత్రలో ఆమెను ఎలా చూపించాలనుకుంటున్నారో త్రిషకు వివరించే ప్రయత్నం చేసినట్టుగా టాక్ వినిపిస్తోంది.కానీ, త్రిష మాత్రం ఈ ఆఫర్‌ను చివరకు రిజెక్ట్ చేసిందట. కారణం—ఈ కథ తనకు అంతగా నప్పలేదనే అభిప్రాయం. పాత్ర సరిగ్గా తన ఇమేజ్‌కు సరిపడదని భావించిన ఆమె, మర్యాదపూర్వకంగా ఈ ప్రాజెక్ట్‌కు నో చెప్పిందని ఇండస్ట్రీ టాక్ చెబుతోంది.
ఈ నేపథ్యంలో, త్రిష వదిలేసుకున్న రోల్‌కు నయనతారను ఫైనల్ చేసినట్టు వార్తలు షేర్ అవుతుండటంతో, ఈ న్యూస్ ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతుంది. “త్రిష రిజెక్ట్ చేసిన సినిమాలో నయనతార ఎంట్రీ… బాలకృష్ణ–నయన్ కాంబో మళ్లీ ఫైర్ చేస్తుంది” అంటూ అనేక పోస్టులు, మీమ్స్, డిస్కషన్లు వైరల్ అవుతున్నాయి.ఇక బాలయ్య–నయన్ కాంబినేషన్ గతంలో కూడా బ్లాక్‌బస్టర్ హిట్స్ ఇచ్చిన నేపథ్యంలో, ఈ సినిమా మీద అంతకంతకు భారీ బజ్ పెరుగుతోంది. ప్రాజెక్ట్ గురించిన మరిన్ని అప్డేట్స్ రానున్న రోజుల్లో రానున్నాయి అని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఒక్కటి మాత్రం నిజం..నిజంగా త్రిష ఈ రోల్ కి ఒప్పుకున్న సినిమాపై ఇంత హై బజ్ ఉండేది కాదు. నయన్ కాబట్టే ఈ రేంజ్ ఊపు వచ్చింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి