ఇదిలా ఉండగా—పెళ్లి తర్వాత రష్మిక కెరీర్‌లో మార్పులు రావడం తప్పదని కొందరు సినీ విశ్లేషకులు మరియు నెటిజన్లు భావిస్తున్నారు. ముఖ్యంగా ఆమె ఇప్పటివరకు చేసినట్టు హాట్ రోల్స్, బోల్డ్ క్యారెక్టర్స్, వంటి వాటి అవకాశాలు తగ్గిపోవచ్చని అందరూ చర్చిస్తున్నారు. అందుకే కొంతమంది సోషల్ మీడియాలో, “పెళ్లికి ముందే ఒక్క ఐటమ్ సాంగ్ చేసినా బావుంటుంది… కెరీర్‌లో చేసేయాలన్న కోరిక తీరిపోతుంది” అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు. నిజానికి గతంలో కూడా రష్మిక కి ఐటెం సాంగ్ లో నటించమంటూ ఆఫర్లు వచ్చాయి. కానీ ఆమె చెయలేదు.
ఇక మరికొందరు ఇంకాస్త ముందుకెళ్లి, రష్మిక కెరీర్ డైరెక్షన్‌పై సలహాలు కూడా ఇస్తున్నారు. “విజయ్ దేవరకొండ ఒప్పిస్తే రష్మిక ఇప్పుడే ఓ మాస్ ఐటమ్ నంబర్ కమిట్ అయిపోవచ్చు. అలా చేస్తే ఆమెకు కొత్త ఇమేజ్ వస్తుంది. ఫ్యాన్స్‌కు కూడా కిక్ ఉంటుంది. పెళ్లి తర్వాత ఇలాంటి అవకాశాలు రాకపోవచ్చు.”అంటూ తమ అభిప్రాయాలను చెప్తున్నారు.అయితే ఈ వ్యాఖ్యల్లో నిజం ఎంత అన్నది పక్కన పెడితే… ఒక విషయం మాత్రం క్లియర్ — రష్మిక–విజయ్ పెళ్లి రూమర్స్ ప్రస్తుతం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు, సోషల్ మీడియా నుంచి న్యూస్ రూమ్‌ల వరకు పెద్ద చర్చను రేపుతున్నాయి. ఈ జంట నిజంగా ఎప్పుడు అధికారికంగా అనౌన్స్ చేస్తారో అన్న కుతూహలం అభిమానుల్లో రోజురోజుకూ పెరుగుతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి