గత ఎన్నికల్లో భారీ మెజారిటీ నీ సొంతం చేసుకొని తన చిరకాల వాంఛ అయిన ముఖ్యమంత్రి పదవిని  చేపట్టారు వైయస్ జగన్మోహన్ రెడ్డి. ఇక జగన్ ఏపీ సీఎం అయ్యాక రాష్ట్ర  పాలన తీరు మారిపోయింది. ఎన్నో సంక్షేమ పథకాలు... మరెన్నో అభివృద్ధి పథకాలు... ఇంకెన్నో కీలక నిర్ణయాలు. ఇలా రాష్ట్ర పాలనను గాడిలో పెట్టి ముందుకు సాగుతున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రజల సంక్షేమానికి ఎన్నో వినూత్న పథకాలను ప్రవేశపెడుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి... రాష్ట్ర అభివృద్ధి కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగులు అందరికీ ఉద్యోగాలు కల్పిస్తామని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. 

 

 

 

 ఎన్నికల ముందు ఇచ్చిన అన్ని హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తు వస్తున్న  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులకు ఉద్యోగం కల్పిస్తామని ఇచ్చిన హామీలు కూడా  నెరవేరుస్తున్నారు . ఈ క్రమంలోనే ఒకేసారి లక్షకుపైగా ఉద్యోగాల భర్తీని చేపట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సరికొత్త రికార్డును సృష్టించారు సీఎం జగన్మోహన్ రెడ్డి. అంతేకాకుండా నిరుద్యోగులు అందరికీ ప్రతి జనవరి నెలలో ఉద్యోగాల భర్తీ  ఉంటుందని జగన్మోహన్ రెడ్డి  సర్కార్ స్పష్టం చేసింది. నిరుద్యోగులు అందరికీ ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తమ ప్రభుత్వానిదే  అంటూ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు

 

 

 

 అయితే తాజాగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిరుద్యోగులకు కొన్ని రోజుల్లో మరో తీపికబురు చెప్పనుంది . అయితే గతంలో ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయోపరిమితి 42 ఏళ్ల వరకు ఉంది. కాగా  అభ్యర్థుల వయోపరిమితి 42 ఏళ్ల వరకు ఉన్న జీవో గడువు ముగియడంతో... జగన్మోహన్ రెడ్డి సర్కారు దీనిపై కీలక నిర్ణయం తీసుకోనుంది . ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయోపరిమితి పెంచేందుకు జగన్ సర్కార్ యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయోపరిమితి 42 ఏళ్లు ఉండగా... జగన్ ప్రభుత్వం ఈ వయోపరిమితిని ఒకటి లేదా రెండు ఏళ్ళు అదనంగా పెంచేందుకు కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు కూడా విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఇది ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు ఓ మంచి శుభవార్త అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: