టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ జనాల్లో  కూడా చాలా మార్పు వస్తుంది. ఒకప్పుడు కలిసి మాట్లాడుకుంటే హ్యాపీగా ఫీల్ అయ్యే ప్రజలు ఇప్పుడు చాటింగ్ లో మీటింగ్ లు డేటింగ్లు అంటూ టెక్నాలజీ కి అలవాటు పడిపోయారు. అయితే ప్రస్తుతం జనాలందరూ డైరెక్ట్ గా కలిసి మాట్లాడం కంటే  ఆన్లైన్లో మాట్లాడుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఆన్లైన్ వెంట పరుగులు పెడుతుంది. స్మార్ట్ ఫోన్ల  రాకతో ప్రపంచం మొత్తం మనిషి అరచేతిలోకి వచ్చేస్తుంది. మనిషికి ఏమైనా కావాలంటే ఎక్కడకొ  వెళ్లి తెచ్చుకోవలసిన పనిలేదు ఒక్క క్లిక్ చేస్తే సరిపోతుంది. 

 

 

 

 అయితే ప్రస్తుతం చాటింగ్ చేసుకోవడానికి ఎన్నో ఆన్లైన్ యాప్ లు  ఉన్నప్పటికీ వాట్సాప్ కి ప్రజల్లో ఉన్న క్రేజ్ మాత్రం ప్రత్యేకం. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర వాట్సాప్ ఉండడం కామన్. చాటింగ్ చేయడానికి ఎన్నో యాప్ లు  ఉన్నప్పటికీ వాట్సాప్ ద్వారానే ఎక్కువ చాటింగ్ చేయడానికి ఇష్టపడుతుంటారు ప్రజలు. వాట్సాప్ కూడా వినియోగదారుల కోసం కొత్త కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతూ వినియోగదారులను ఆకర్షిస్తూ ఉంటుంది. ఇక ఇప్పటి జనాలు అయితే డైరెక్ట్ గా  మాట్లాడుకోవడం  అంటే వాట్సాప్ లో చాటింగ్ చేసుకోవడం...కలవటం  కంటే వాట్సాప్ వీడియో కాల్ లో కనబడటమే ఎక్కువ ఇష్టపడుతున్నారు. పక్క పక్కనే ఉన్న వాట్సాప్ లో చాటింగ్ చేసుకోవడంపైనే దృష్టి పెడుతున్నారు. 

 

 

 

 అయితే జనాలను అంతగా ఆకర్షించిన వాట్సాప్ ఎప్పుడు సరి కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతూ వినియోగదారులను ఆకర్షిస్తూ ఉంటుంది. ఇప్పటికే వినియోగదారుల కోసం ఫింగర్ ప్రింట్ అన్  లాక్ ను కూడా తీసుకొచ్చింది వాట్సాప్. ఈ ఫీచర్ తో వాట్సప్ వినియోగదారులందరూ తెగ ఆకర్షితులయ్యారు. ఇక తాజాగా మరో రెండు  ఫీచర్ లను కూడా తీసుకు వచ్చింది వాట్సాప్ . ఇప్పటినుండి వాట్సాప్ లో ఎవరైనా బ్లాక్  చేస్తే ఆ కాంటాక్ట్ నోటిఫికేషన్ తరహాలో కనిపించనుంది. ఇటీవలే కొన్ని కంపెనీలు వాట్సాప్ ద్వారా మార్కెటింగ్  చేస్తున్న విషయం తెలిసిందే. మార్కెటింగ్ మెసేజ్ నుండి తప్పించుకోవడానికి బిజినెస్ కాంటాక్టు లను కూడా బ్లాక్ చేస్తుంటాం. ప్రస్తుతం వాట్సాప్ ప్రవేశపెట్టిన కొత్త ఫీచర్ తో బ్లాక్ చేసిన నెంబర్ పై వ్యక్తిగత నెంబర్లు  బిసినెస్  నెంబర్లు విడివిడిగా కనిపిస్తూ ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: