ఢిల్లీలో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు నుండి డిసెంబర్ నెల 13వ తేదీ వరకు శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. పార్లమెంట్ ఉభయసభలు దివంగత నేతలు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీలకు ఘనంగా నివాళులు అర్పించాయి. కశ్మీర్ లో ఫరూక్ అబ్దుల్లా నిర్భంధంపై టీఎంసీ, మహారాష్ట్రలో వర్షాలకు నష్టపోయిన పంటపై శివసేన, కశ్మీర్ లో పరిస్థితులపై కాంగ్రెస్ లోక్ సభలో  వాయిదా తీర్మానాలను ప్రవేశపెట్టాయి. 
 
తొలిరోజు సమావేశాల్లోనే లోక్ సభలో గందరగోళం నెలకొంది. పలు అంశాలపై చర్చించాలని విపక్షాలు పట్టు పడుతున్నాయి. ప్రశ్నోత్తరాలను అడ్డుకునేందుకు విపక్ష సభ్యులు ప్రయత్నిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని ప్రాంతీయ భాషల పరిరక్షణ గురించి లోక్ సభలో ప్రశ్నించారు. సంస్కృతి, సాంప్రదాయాల్ని రక్షించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని కేశినేని నాని అన్నారు. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం పాఠశాలల్లో ఇంగ్లీష్ ను తప్పనిసరి చేసిందని కేశినేని నాని చెప్పారు. త్రిభాషా విధానాన్ని అమలు చేయాలని కేశినేని నాని కోరారు. కేంద్ర మంత్రి ఫోఖ్రియాల్ కేశినేని నాని ప్రశ్నకు తెలుగు భాష ఉన్నతికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బెనారస్, హైదరాబాద్ మొదలైన విశ్వవిద్యాలయాల్లో తెలుగు భాషా పీఠాల అభివృద్ధి కొరకు చర్యలు చేపట్టామని మంత్రి ఫోఖ్రియాల్ తెలిపారు. 2011 సంవత్సరంలో హైదరాబాద్ నగరంలో తెలుగు అధ్యయన కేంద్రాన్ని నెలకొల్పామని మంత్రి ఫోఖ్రియాల్ గుర్తు చేశారు. 
 
కేంద్రం భారతీయ భాషల అభివృద్ధికి కట్టుబడి ఉందని ఫోఖ్రియాల్ చెప్పారు. శాస్త్రీయ అధ్యయన కేంద్రాన్ని తెలుగు భాష ఉన్నతికి తీసుకుంటున్న చర్యల్లో భాగంగా నెల్లూరులో ఏర్పాటు చేశామని ఈ నెల 13వ తేదీన శాస్త్రీయ అధ్యయన కేంద్రంలో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని మంత్రి ఫోఖ్రియాల్ తెలిపారు. కొత్తగా ఎన్నికైన సభ్యులతో లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా ప్రమాణం చేయించారు. గందరగోళం మధ్యనే ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: