నిర్భయ దోషులకు ఉరి శిక్ష అమలు వ్యవహారం ములుపులు తిరుగుతోంది. వినయ్ శర్మ పిటిషన్ ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించారు. దీంతో రాష్ట్రపతి క్షమాభిక్ష కోరేందుకు మరో ఇద్దరు నిర్భయ దోషులు మిగిలి ఉన్నారు. ఇటు దోషుల్ని ప్రభుత్వం పెంచి పోషిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు నిర్భయ తల్లి. మరోవైపు...నిర్భయ దోషుల ఉరిశిక్ష  స్టేపై  హైకోర్టును ఆశ్రయించింది.  కేంద్రహోంశాఖ.పాటియాల కోర్టు తీర్పును సవాలు చేస్తూ  పిటిషన్ దాఖలు చేసింది. రేపిస్టులను విడివిడిగా ఉరితీయాలని కోరింది హోంశాఖ. నిర్భయ దోషులకు నోటీసులు జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు. దీనిపై రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారించనుంది.

 

నిర్భయ దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించారు. దీనిపై కేంద్ర హోం శాఖ ఓ ప్రకటన చేసింది. నిర్భయ గ్యాంగ్ రేప్ కు సంబంధించి క్షమాభిక్షను రాష్ట్రపతి తిరస్కరించడం ఇది రెండో సారి. వాస్తవానికి  ఉదయం 6 గంటలకు నిర్భయ దోషులు అక్షయ్ కుమార్, ముఖేశ్ సింగ్, పవన్ గుప్తా, వినయ్ శర్మలకు ఉరిశిక్షను అమలు చేయాల్సి ఉంది. ఐతే...ఉరిశిక్షను వాయిదా వేయించేందుకు వీరు కోర్టుల్లో పలు పిటిషన్లు వేస్తూ వస్తున్నారు. రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకునేందుకు ఇంకా ఇద్దరు దోషులకు అవకాశం ఉంది. 

 

ఇక...నిర్భయ కేసులో అరెస్టైన నాటి నుంచి ఇప్పటి వరకు తాను చాలాసార్లు మరణించానని అందులో వినయ్‌ తెలిపాడు. 'తను జైలుకు వచ్చిన తొలి రోజే అక్కడ విధుల్లో ఉన్న తమిళనాడు ప్రత్యేక పోలీసు సిబ్బంది చితకబాదారని గుర్త చేశాడు. తర్వాత 15-20 మంది ఖైదీలు దారుణంగా కొట్టారని అన్నాడు.  తనను, నిర్భయ కేసులో దోషులుగా తేలిన మిగతా వారిని చిత్రహింసలు పెట్టారు. మాలో ఒకరు లైంగిక వేధింపులకు కూడా గురయ్యారు' అని వివరించాడు. 'తన గోడు ఎవరూ వినలేదని... మీరైనా ఆలకిస్తారని ఆశిస్తున్నా' అని వినయ్‌ తన పిటిషన్‌లో తెలిపాడు. రాష్ట్రపతిని ఉద్దేశిస్తూ స్వయంగా రాసిన ఓ లేఖను పిటిషన్‌కు వినయ్‌ జతపర్చాడు. అన్నింటిని పరిశీలించిన రాష్ట్రపతి క్షమాభిక్ష అభ్యర్థనను తిరస్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 

 

మరోవైపు...దోషి ముకేశ్‌ పెట్టుకున్న క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి గతంలోనే తిరస్కరించారు. దీంతో ముకేశ్‌కు ఉన్న అన్ని మార్గాలు మూసుకుపోయాయి. రాష్ట్రపతి వద్ద క్షమాభిక్ష, దానిపై సుప్రీంకోర్టులో అప్పీలూ తిరస్కరణకు గురైంది. అతడు పెట్టుకున్న క్యురేటివ్‌ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. వినయ్‌ పెట్టుకున్న రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్‌ తిరస్కరణకు గురైంది. ఇక మరో దోషి అక్షయ్‌కుమార్‌కు క్షమాభిక్ష అభ్యర్థించే అవకాశం ఉండగా.. పవన్‌గుప్తా ఇప్పటి వరకు క్యూరేటివ్‌ పిటిషన్‌ దాఖలు చేయలేదు. ఫిబ్రవరి 1న ఉరిశిక్ష అమలు చేయాల్సిందిగా ఇచ్చిన డెత్‌ వారెంట్‌ జారీ చేసింది. దీంతో తమకు విధించిన ఉరిశిక్ష అమలుపై స్టే ఇవ్వాల్సిందిగా ఉరికి రెండు రోజుల ముందు నలుగురు దోషులు ఢిల్లీ పటియాలా కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దాన్ని పరిశీలించిన న్యాయస్థానం ఉరి అమలును వాయిదా వేస్తూ తీర్పునిచ్చింది. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ఉరి అమలు చేయొద్దంటూ తీహార్ జైలు అధికారులకు సూచించింది. 

 

అయితే... నిర్భయ దోషుల ఉరిశిక్ష స్టేపై హైకోర్టును ఆశ్రయించింది కేంద్రహోంశాఖ. పాటియాల కోర్టు తీర్పును సవాలు చేస్తూ కేంద్ర హోంశాఖ పిటిషన్ దాఖలు చేసింది. దోషులకు ఉరి శిక్ష అమలు చేయటంలో జాప్యంపై నిర్భయ తల్లి అసంతృప్తి వ్యక్తం చేసింది. శిక్ష నుంచి దోషులు తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపింది. వీలైనంత త్వరలో ఉరి శిక్ష అమలు చేయాలని కోరింది నిర్భయ తల్లి. 

మరింత సమాచారం తెలుసుకోండి: