దేశంలో ఒకవైపు కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుంటే మరోవైపు వర్షాకాలం కావడం వల్ల సీజనల్ వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. నిలిచిపోయిన వర్షపునీటి ద్వారా దోమల నుంచి కలుషిత నీటి ద్వారా బ్యాక్టీరియా నుంచి వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. ఇలాంటి వాతావరణంలో వ్యాధులను ఎదుర్కోవాలంటే మనల్ని మనం బలంగా తయారు చేసుకోవడం ఎంతో ముఖ్యం. రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి నిద్రే ఔషధం.
 
సరైన నిద్ర లేకపోతే ఇమ్యూనిటీ బలహీనపడే అవకాశం ఉంది. రోజుకు 6 గంటల కన్నా తక్కువ సమయం నిద్రపోయిన వాళ్లు జలుబు, ఫ్లూ బారిన ఎక్కువగా పడతారని శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. తగినంత నిద్ర నిద్రపోతే ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌ తగ్గడంతో పాటు సహజంగా వ్యాధి నిరోధక శక్తి నిద్ర ద్వారా చైతన్యవంతం అయ్యే అవకాశాలు ఉంటాయి. చిన్న పిల్లలు, చంటి పిల్లలకు 14 గంటల నిద్ర, టీనేజీలో ఉన్నవాళ్లకు 8 నుంచి 10 గంటల నిద్ర, పెద్దవాళ్లకు కనీసం 7 గంటల నిద్ర ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
 
మంచి నిద్ర కావాలంటే గాడ్జెట్స్‌ వాడకాన్ని తగ్గించాలని నిపుణులు సూచిస్తున్నారు. మన శరీరం రోగాలను ఎదుర్కోవాలన్నా బలంగా ఎదగాలన్నా, మెదడు చురుగ్గా పనిచేయాలన్నా మనం తీసుకునే ఆహారమే ముఖ్యం. అందువల్ల నాణ్యమైన ఆహారం, పోషకాలతో కూడిన ఆహారంపై మనం ప్రధానంగా దృష్టి పెట్టాలి. ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని మనం ఎక్కువగా తీసుకోవాలి.
 
శాకాహారాన్ని ఎక్కువగా తీసుకుంటూ కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉంటే మంచిది. ఇమ్యూనిటీ పెరగాలంటే తగినంత శారీరక శ్రమ అవసరం. ప్రతిరోజూ చేసే వ్యాయామం వల్ల రక్తప్రసరణ బాగా జరిగి కణాలకు ఆక్సిజన్ అంది వ్యాధి నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. ఉదయం సమయంలోనే వ్యాయామం చేస్తే మరీ మంచిది. ఇమ్యూనిటీని పెంచుకోవడానికి దురలవాట్లను మానేయాలి. మధుమేహం, గుండెపోటు, అధిక రక్తపోటు వల్ల మన శరీరంపై ఒత్తిడి పెరుగుతుంది. ఒత్తిడిని తగ్గించుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: