హైదరాబాద్ లో గంజాయి విషయంలో పోలీసులు ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే రవాణా మాత్రం ఆగడం లేదనే చెప్పాలి. దీనిపై హైదరాబాద్ పరిధిలో ఉన్న మూడు కమీషనరేట్ ల పరిధిలో పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. అయినా సరే అక్రమ రవాణా ఆగడం లేదు. ఇదిలా ఉంటే రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ మురళీధర్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేసారు. అంతరాష్ట్ర  గంజాయి స్మగ్లింగ్ ముఠాను  9 మంది ని అరెస్ట్ చేసినట్టు ఆయన వెల్లడించారు. హయత్ నగర్ మరియు  ఎల్బీనగర్ ఎస్ ఓ ఐ పోలీసులు అరెస్ట్ చేసారని చెప్పారు.

పరారీలో  కార్తిక్ రాథోడ్ అనే వ్యక్తి ఉన్నారని, వీరి వద్ద నుండి  83 లక్షల 60 వేల విలువజేసే  650 కిలోల గంజాయి,  ఒక మారుతి  ఏర్టిగా,  ఒక ఐచేరు వాన్, 10 మొబైల్స్,  నగదు 60 వేల రూపాయల స్వాధీనం చేసుకున్నారు  అని ఆయన పేర్కొన్నారు. విశాఖపట్నం ఏజెన్సీ ఏరియా నుండి జహీరాబాద్ కి  సరఫరా చేస్తున్న ముఠా ని అరెస్ట్ చేసినట్టు చెప్పారు. ఎర్తిగా వాహనాలు నుండి విశాఖపట్నం నుండి ఐషర్ వాహనం ద్వారా దీన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారని, పక్కా సమాచారం తో అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు.

ముఖ్యమైన నిందితుడు పాతాళ నగేష్ ని అరెస్ట్ చేసామని పేర్కొన్నారు. ఇతనిపై గతంలో ఏజెసి నుండి 350  కి గ్రామ్  కొనుగోలు చేసి,  మహారాష్ట్ర, హర్యానా, కర్ణాటక, రాజస్థాన్ కి సరఫరా చేస్తున్నారని,   తీసుకొని ఎక్కడ కి అమ్ముతున్నారు అని ఆయన పేర్కొన్నారు  వీరంతా విశాఖపట్నం ఏజెన్సీ ఏరియా కి చెందిన వారు అని సీపీ వివరించారు. 15 మంది  నిందితులనుగతంలో అరెస్ట్ చేశామని,   వారి పై పిడ్ యాక్ట్ నమోదు చేసామని ఫాస్ట్ ట్రక్ కోర్టు లో  అప్పీల్  చేస్తామని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: