టెక్నాలజీ రోజు రోజుకు నూతన పుంతలు తొక్కుతోంది. శాస్త్రవేత్తల పరిశోధనల ఫలితంగా విద్యుత్తును రకరకాలుగా ఉత్పత్తి చేస్తున్నారు. తాజాగా చెక్కతో కూడా విద్యుత్తును ఉత్పత్తి చేసే ప్రయోగం సక్సెస్ అయ్యింది. ఇకపైన చెక్కతో నిర్మించేటటువంటి బిల్డింగుల ఫ్లోరింగ్ నుంచి కరెంటును ఉత్పత్తి చేయొచ్చు. అంతర్జాతీయ శాస్త్రవేత్తల టీమ్ చెక్క నానోజెనరేటర్‌ను రెడీ చేసింది. ఆ చెక్క ఫ్లోరింగ్ పైన కాలు మోపిన వెంటనే కరెంటు అనేది ఉత్పత్తి చేస్తుంది. దానివల్ల ఎల్ఈడీ లైట్ బల్బులు వెలుగుతాయి. అతి తక్కువ రేటులోనే ఇళ్లలో ఈ నానోజెనరేటర్‌ను ఇన్‌స్టాల్ చేయడం వల్ల ఆర్థికంగా మంచి లాభం చేకూరుతుందని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. విద్యుత్ ను ఉత్పత్తి చేసేటటువంటి పని నానోజెనరేటర్ల ద్వారా అవుతుంది. ఇటువంటి నానోజెనరేటర్ చేయడానికి రెండు చెక్క ముక్కలు వాడారు. చెక్కకు ఒక వైపున పాలిడిమెథైల్సిలోక్సేన్ పొర ఉంటుంది. ఆ తర్వాత ఇంకో వైపున జియోలిటిక్ ఇమిడాజోలేట్ ఫ్రేమ్‌వర్క్-8 పొర అనేది శాస్త్రవేత్తలు ఏర్పాటు చేశారు.

రెండు రసాయనాలు విద్యుత్ ఉత్పత్తి చేసేటప్పుడు ఎలక్ట్రాన్లను ఆకర్షించడానికి, విడుదల చేస్తాయి. అందులో చెక్కలో కొంత భాగం పాజిటివ్ గా పని చేస్తుంది. ఇంకొంత భాగం నెగటివ్ ఛార్జ్‌గా ఉంటుంది. ఈ రెండు చెక్క ముక్కలు రెండు ఎలక్ట్రోడ్‌ల మధ్య ఉంచి ఒక వ్యక్తి ఆ చెక్కపైన నడుస్తాడు. అప్పుడు ఆ చెక్కలు శక్తిని పొంది ఛార్జ్ అవుతుంది. ఈ రకంగా కరెంటు అనేది ఉత్పత్తి అవుతుంది. ఈ కరెంటును ఎల్ఈడీ బల్బులు వెలిగించడానికి ఉపయోగించుకోవచ్చు. సైన్స్ భాషలో చెప్పాలంటే దీనిని ట్రైబోఎలెక్ట్రిక్ అని అంటారు. రాబోవు రోజులలో ఈ విధానాన్ని గదులలో ఇన్‌స్టాల్ చేసుకోవచ్కచు. అదే విధంగా ప్రయాణంలో కరెంటును ఉత్పత్తి చేసుకోవచ్చు. ఈ విధంగా కరెంటును ఉత్పత్తి చేయడానికి ఎంత ఖర్చవుతుందో ఇంత వరకూ క్లారిటీ లేదు. స్విట్జర్లాండ్‌లోని ఈటీహెచ్ జ్యూరిచ్, చైనాలోని చాంగ్‌కింగ్ యూనివర్సిటీ, నార్త్ వెస్ట్రన్ లోని ఇల్లినాయిస్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు మూకుమ్మడిగా ఈ ప్రయోగాలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

led