ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఎయిడెడ్ కాలేజీలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ సహా పలు పార్టీలు రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగానే విమర్శించే ప్రయత్నం చేస్తున్నాయి. రాజకీయంగా ఇది ఏపీలో వివాదాస్పదంగా మారుతున్న అంశం. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శిస్తున్నారు. ఇప్పుడు జనసేన పార్టీ నేతలు కూడా ఈ అంశం గురించి రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు మొదలుపెట్టారు.

దీనిపై ఆ పార్టీ అధికార ప్రతినిది పోతిన వెంకట మహేష్ తీవ్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసారు. విద్యార్దుల జీవితాలతో జగన్ ప్రభుత్వం ఆడుకుంటుంది అని ఆయన మండిపడ్డారు. శతాబ్దాల చరిత్ర కలిగిన ఎయిడెడ్ పాఠశాలలను మూసి వేయడం తుగ్లక్ చర్య  అని మండిపడ్డారు. వేల కోట్ల విలువ చేసే ఆస్తులను దోచుకునేందుకే ఎయిడెడ్ పాఠశాలల స్వాధీనం చేసుకున్నారు అని ఆరోపించారు. పేద, మధ్య తరగతి ప్రజలు కార్పొరేట్ స్కూల్స్ లో ఫీజులు చెల్లించగలరా అని ప్రశ్నించారు.

పేదలకు నాణ్యమైన విద్యను దూరం చేయడం దుర్మార్గం అని ఆవేదన వ్యక్తం చేసారు. జగన్ కపట నాటకాలు అందరికీ అర్ధమైపోతున్నాయి అని అన్నారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు, లాఠీఛార్జి చేస్తారా అని నిలదీశారు. ప్రభుత్వం నిర్ణయం పై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి అని అన్నారు. విద్యార్థులు కు అన్యాయం జరుగుతున్నా మా అవినీతి మంత్రి వెల్లంపల్లి స్పందించరు అని దేవుని ఆస్తులను దోచుకోవడం.. దాచుకోవడమే ఆయనకు తెలుసు అని విమర్శించారు. సిఎం స్పందించి ఎయిడెడ్  నిర్ణయాన్ని మార్చుకోవాలి అని కోరారు. లేకుంటే లక్షలాది మంది‌ విద్యార్థులు తాడేపల్లి ప్యాలెస్ ను ముట్టడించే రోజు వస్తుంది అన్ని అయన హెచ్చరించారు. విజయవాడలో కూడా కొందరు విద్యార్ధులు ఈ అంశం గురించి నిరసనకు దిగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap