తెలంగాణ మంత్రి కేటీఆర్ అవేదన లో అర్థం వుంది. రాజకీయాలలో ఎవరు ఎవరినైనా విమర్శించవచ్చు, ఎన్నైనా ఆరోపణలు చేసుకోవచ్చు. కానీ వారి కుటుంబ సభ్యులను లాగడాన్ని ఎవరు సమర్థించరు. అది సెలబ్రిటీలయినా కావచ్చు, సామాన్యులైనా కావచ్చు. కుటుంబ సభ్యుల వ్యక్తిగత జీవితాలపై రచ్చ చేయడం సరైనది కాదు. కేటీఆర్ కుమారుడిపై పై సోషల్ మీడియాలో కొందరు చేసిన వ్యాఖ్యలపై మంత్రి తీవ్రంగా స్పందించారు. ఈ విషయంలో కేటీఆర్ చాలా బాధ పడ్డారు. చివరకు పిల్లలను కూడా టార్గెట్ చేయడం పై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల సోషల్ మీడియాలో రాజకీయ నాయకులు, క్రికెటర్లు, నటుల కుటుంబాలపై కామెంట్ లు చేయడం జరిగింది. ఆ మధ్య పాక్ తో క్రికెట్ మ్యాచ్ ఓడిపోయినపుడు కోహ్లీ పై ఎలా దారుణంగా కామెంట్స్ చేశారో అందరికీ తెలుసు.

అలా కామెంట్ చేసిన వ్యక్తిని అరెస్టు కూడా చేశారు. అలాగే బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ కూతుర్ని కూడా కొందరు ట్రోల్ చేశారు. అప్పుడు అభిషేక్ ఘాటుగా బదులిచ్చారు. ఇక తెలుగురాష్ట్రాల విషయానికి వస్తే అప్పట్లో వైయస్ షర్మిల పై కూడా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారు. ఆమె దీనిపై ఫిర్యాదు కూడా చేశారు. టిడిపి అధినేత చంద్రబాబు భార్యపై కొందరు చేసిన వ్యాఖ్యలపై ఈమద్యే దుమారం రేగింది. ఇలా అన్ని రంగాలలో మహిళలు, పిల్లలను కొందరు టార్గెట్ చేయడం ఎక్కువవుతోంది. ఇక సోషల్ మీడియాలో పోస్టులకు అయితే అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఎవరు ఎవరి పైన అయినా ఎలాంటి వ్యాఖ్యలైనా చేయొచ్చు అనుకుంటున్నారు. ఈ విషయంలో అపరిమితమైన స్వేచ్ఛ ఉందని భావిస్తున్నారు.చాలా సందర్భాలలో వీటిని సీరియస్ గా తీసుకోకపోవడం కూడా వీరు రెచ్చిపోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అలాగే ఇలాంటి కామెంట్ చేసే వారిని కఠినంగా శిక్షించే విధంగా చట్టాలు లేవంటున్నారు.

 నేరుగా ఒక వ్యక్తిని ఏమీ చేయలేకే వారి కుటుంబ సభ్యులను ఇందులోకి లాగుతున్నారనడంలో సందేహం లేదు. ప్రభుత్వ విధానాలపై పోరాడటానికి ఎన్నో అంశాలుంటాయి. అలాగే రాజకీయ పార్టీల వైఖరిని ప్రశ్నించడానికి ఎన్నో అంశాలు ఉంటాయి.ఈ విషయంలో పోరాడడానికి ఎన్నో విధాలుగా వేదికలు ఉంటాయి. కానీ వీటితో సంబంధం లేని కుటుంబ సభ్యులను ఇందులోకి లాగి వారిని బాధపెట్టినప్పుడే సమస్య వస్తుంది. ఈ ధోరణి మారాల్సిన అవసరం ఉంది. ప్రజల సమస్యలపై ప్రశ్నించనంతవరకు ఎవరూ ఎవరినీ తప్పు పట్టారు. సోషల్ మీడియా ను మంచి మార్పు కోసం వినియోగించుకుంటే  ఎవరూ అభ్యంతర పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: