ఏదో సామెతలో చెప్పినట్లుగా ప్రతిపక్షాలు ఉద్యోగులు తగలబెడుతున్న జీవోల మంటల్లో చలి కాచుకుంటున్నాయి. పీఆర్సీ విషయంలో ప్రధానమైన హెచ్ఆర్ఏ అంశంపై ప్రభుత్వానికి ఉద్యోగులకు వివాదం మొదలైంది. హెచ్ఆర్ఏ తగ్గించటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తు ఉద్యోగసంఘాల నేతల పిలుపు కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులందరు రోడ్లమీదకు వచ్చారు. కొత్త పీఆర్సీ పద్దతిలో తమ జీతాలు తగ్గిపోతాయి కాబట్టి పాత విధానమే తమకు కావాలనే డిమాండ్లు కూడా ఉద్యోగులు వినిపిస్తున్నారు.




సరే ఈ వివాదం ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య. కాబట్టి ఈ వివాదాన్ని ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల నేతలే తేల్చుకుంటారు. అయితే ఆ అవకాశం వాళ్ళకు ఇవ్వకూడదని మధ్యలో ఎల్లోమీడియా, ప్రతిపక్షాలు దూరేశాయి. ఒకపుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగసంఘాలు ఏవైనా నిర్ణయం తీసుకుంటే దాన్ని అచ్చేసేవి. ఉద్యోగులు రోడ్డెక్కితే దాన్ని వార్తల రూపంలో అచ్చేసేవాళ్ళు. కానీ ఇపుడు పరిస్ధితి ఏమిటంటే ఎల్లోమీడియానే ఉద్యోగులను ప్రభుత్వంమీదకు ఉసిగొల్పుతోంది. జగన్ పైన యుద్ధం చేయటానికి తాము సరిపోమని ప్రతిపక్షాలకు అర్ధమైపోయింది. అందుకని ఇపుడు ఉద్యోగ నేతల ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుంటున్నాయి.




పీఆర్సీ విషయంలో జరిగిందిదే. ప్రభుత్వానికి-ఉద్యోగసంఘాలకు మధ్య పీఆర్సీ వివాదం పరిష్కారం కాకూడదని ఎల్లోమీడియా, ప్రతిపక్షాల్లో ప్రధానంగా టీడీపీ అనుకున్నాయి. అయితే ఏవో తిప్పలుపడి జగన్ ఆ విషయాన్ని పరిష్కరించుకున్నారు. అది నచ్చని ఎల్లోమీడియా ఉద్యోగసంఘాల నేతలపైకి ఉద్యోగులను ఉసిగొల్పింది. ప్రభుత్వం, ఉద్యోగసంఘాల నేతలకు వ్యతిరేకంగా పదే పదే వార్తలు, కథనాలు రాసింది. దాన్ని టీడీపీ బాగా ప్రచారంలోకి తీసుకొచ్చింది. సమ్మె చేస్తారని అనుకున్న ఉద్యోగుల నేతలు సమ్మె విరమించటంపై అచ్చెన్నాయుడు ఎగతాళిగా వ్యాఖ్యలు చేయటమే దీనికి నిదర్శనం.




అలాంటిది పీఆర్సీ విషయం పోయి హెచ్ఆర్ఏ అంశంపై గొడవ మొదలవ్వగానే వెంటనే ఎల్లోమీడియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చిపోతోంది. దీనికి ప్రతిపక్షాలు వంతపాడుతున్నాయి. ప్రభుత్వం మీద తమకున్న ధ్వేషాన్ని ఉద్యోగ సంఘాలను అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాలు తీర్చుకుంటున్నాయి. ఎల్లోమీడియా, ప్రతిపక్షాలు తీరు ఎలాగుందంటే మళ్ళీ ఉద్యోగనేతల ప్రభుత్వం చెప్పిన మాటలు విని ఎక్కడ కన్వీన్సయిపోతారో, ఆందోళనలు ఎక్కడ విరమించుకుంటారో అని టెన్షన్ పడుడుతున్నట్లు ఉంది. అందుకనే ఉద్యోగనేతలను వదిలేసి ఉద్యోగులను టార్గెట్ చేస్తున్నది. మొత్తానికి ఏపీలో భలే రాజకీయం జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: