బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ మరొ బహిరంగ ప్రకటన విడుదల చేసేశారు.  తెలంగాణకు సంబంధించి ములుగు జిల్లాలోని కాకతీయుల కాలం నాటి రామప్ప దేవాలయాన్ని.. యునెస్కో అంతర్జాతీయ పర్యాటక సంస్థగా గుర్తించినట్లుగా రాష్ట్రపతి ప్రసంగంలో తెలపడం సంతోషకరమని చెప్పారు బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్.  గత నాలుగు దశాబ్దాలు గా అప్పటి కాంగ్రెస్, ఇతర ప్రభుత్వాలు కూడా ప్రయత్నించినా సాధ్యంకాని ఈ గుర్తింపు,.. నరేంద్ర మోదీ గా రి నాయకత్వం లోని ఎన్డీయే ప్రభుత్వానికి సాధ్యమైందని పేర్కొన్నరు బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్. యునెస్కోలోని 23 సభ్యదేశాలను ఒప్పించే ప్రయత్నంలో కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా కీలక పాత్ర పోషించారని స్పష్టం చేశారు బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్.  

ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రం నుంచి ఎన్నుకోబడ్డ నాతోపాటు మి గతా పార్లమెంట్ సభ్యుల యొక్క కృషి కూడా ఉంది.గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ నుంచి ఇదే పర్యాటక, సాంస్కృతిక శాఖకు మంత్రి ఉన్న ప్పటికీ.. రామప్పకు ఈ గుర్తింపు సాధ్యం కాలేదని పేర్కొన్నారు బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్.  నరేంద్ర మోదీ గారి ప్రభు త్వం సాధించిన ఈ విజయాన్ని రాష్ట్రపతి ప్రసంగం ద్వారా దేశ ప్రజలకు వివరించడం సంతోషంగా ఉందని చెప్పారు బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్య క్షులు బండి సంజయ్ కుమార్.  ఇటువంటి సందర్భాలలో రాష్ట్రపతి లాంటి ఉన్నతమైన వ్యక్తులు రామప్ప యొక్క గొప్పతనాన్ని భారత ప్రజలకు చెప్పడం ద్వారా ఈ ప్రాంతంలో టూరిజం అభివృద్ధి చెంది, మరింత ఆర్థిక మైన అభివృద్ధికి దోహదపడుతుందని భావిస్తున్నానన్నారు బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్.


మరింత సమాచారం తెలుసుకోండి: