హైదరాబాద్ లో ఇటీవల అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న సంగతి తెలిసిందే.. ఎంతో మంది ప్రాణాలును కోల్పోయిన సంగతి తెలిసిందే.. మొన్నీమధ్య బోయిగూడ లో జరిగిన అగ్ని ప్రమాదం అందరినీ కలచి వేస్తుంది. ఆ అగ్ని ప్రమాదం లో దాదాపు 11 మంది చనిపోయిన సంగతి తెలిసిందే.. భారీగా ఆస్తి నష్టం కూడా జరిగింది. ఈ ఘటన జరిగినప్పుడు 12 మంది అక్కడ వున్నట్లు విచారణలో తేలింది.. ఆ వ్యక్తికి సగం శరీరం పూర్తిగా కాలిపొయింది. అయితే ప్రమాదం ఎలా జరిగింది విషయం పై పోలీసులు విచారించారు. అయిన పూర్తీ వివరాలు తెలియలేదు.


ప్రమాదం నుంచి బయట పడ్డ ప్రేమ్‌ ప్రస్తుతం గాంధీ దవాఖాన లో చికిత్స పొందుతున్నాడు.. అయితే అతను కొద్దిగా కోలుకోవడం తో పోలీసులు అతణ్ణి నుంచి వివరాలు సేకరించే పనిలో పడ్డారు..ఈ ఘటన పై మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ చంద్రయ్య, అగ్ని మాపక శాఖ డీజీ మాదిరెడ్డి, సికింద్రాబాద్‌ ఆర్డీవో వసంతకుమారి, ఎమ్మార్వో బాలశంకర్‌, అగ్ని మాపక అధికారి శ్రీనివాస్‌లతో కలిసి పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాల ను అధికారులను అడిగారు. ఈ ప్రమాదం లో ఏకంగా 11 మంది చని పోవడం భాధాకరమని అంటున్నారు.


ఘటన పై పూర్తీ వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని వాళ్ళు తెలిపారు. బిహారీ వలస కూలీలను నిన్న మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ను కలిసి పూర్తీ విషయాల ను తెలుసుకున్నారు. తెలంగాణ సర్కారు వెంటనే స్పందించడం, రూ. 5 లక్షల నష్ట పరిహారం ప్రకటించారు. అంతే కాదు చనిపోయిన వారి మృతదేహాలను వారి ఇళ్ళకు తరలించడానికి సహకరించారు. అక్కడ కాంట్రాక్టర్లు వలస కార్మికులకు సత్వరమే కూలీ డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు ఇక మీదట జరగకుండా జాగ్రత్రలను తీసుకుంటామని వారు తెలిపారు..


మరింత సమాచారం తెలుసుకోండి: