దేశంలో ప్రస్తుతం అందరి నోటా ఒకటే మాట వినిపిస్తోంది. ప్రతి ఒక్కరికీ అత్యంత అవసరం అయిన వస్తువుల ధరలు అన్నీ కూడా రోజు రోజుకీ అధికం అవుతున్నాయి. ఈ విషయం పట్ల సామాన్యులు ఎంత గింజుకుంటున్నా పట్టించుకునే ప్రభుత్వం లేదు. దేశ వ్యాప్తముగా ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. గత నెల క్రితం ముందు రష్యా మరియు ఉక్రెయిన్ దేశాల మధ్యన జరిగిన యుద్ధం కారణంగా పెట్రోల్ మరియు డీజిల్, వంట నూనెల ధరలు పెరిగాయని సోషల్ మీడియాల్లో వార్తలను ఊదరగొట్టారు. అయితే ఇప్పుడు యుద్ధం కాస్తా ఆగినా కూడా ఇంకా ధరలలో మార్పులు కనిపించకపోవడం శోచనీయం.

కేవలం గడిచిన పది రోజులలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు ఎంత వరకు పెరిగాయో అందరికీ తెలిసిందే. అలా వరుసగా పెరుగుతూ వచ్చిన పెట్రోల్  డీజిల్ ధరలు ఈ రోజు చల్లబడ్డాయి అని తెలుస్తోంది. అయితే సీఎన్జీ ధర మాత్రం పెరుగుతూనే ఉంది. ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి ధరలు పెరుగుదల మాత్రం ఆగలేదు. అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం దేశీయ ఆయిల్ కంపెనీలు అన్నీ ఒక కిలో సీఎన్జీ పైన మూడు రూపాయలు పెంచాయి. ఈ పెరిగిన ధరతో ప్రస్తుతం ఢిల్లీ  కిలో సీఎన్జీ రూ. 69.11 కు చేరింది. ఇక మిగిలిన ప్రధాన నగరాలు అయిన నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్ నగరాలలో సీఎన్జీ ధర రూ. 71.67 గా ఉంది.

అంతే కాకుండా ఇటీవల గ్యాస్ ధరలు రికార్డు స్థాయికి పెరిగిన సంగతి తెలిసిందే. అది జరిగిన కొద్దీ రోజులకు ఇలా సీఎన్‌జీ ధర మొత్తం రూ. 9.6 పెరగడం ఆశ్చర్యకరం. ఇక ఇది గత నెలలో అయిదు రాష్ర్ట్రాల ఎన్నికల ఫలితాలు ముగిసిన అనంతరం నుండి ఇలా అన్ని వస్తువుల మీద ధరల బాదుడు ఎక్కువ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: