సమ్మర్ వచ్చింది అంటే కరెంట్ కోతలు కూడా ఎక్కువగానె వుంటాయి. ఒకవైపు ఫ్యాన్ లేనిది ప్రజలు ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారింది.. సూర్యుడు రోజు రోజుకు నిప్పులు చెరుగుతున్నాడు.. అందుకే ఉదయం పది దాటిన తర్వాత బయటకు రావాలంటే మాత్రమే అందరు భయంతో వణికి పోతూన్నారు.. ఇలాంటి పరిస్థితులలో ప్రభుత్వాలు మనుషుల ప్రాణాలతో ఆడుకుంటున్నాయి.. కరెంట్ కొరత నుంచి రాష్ట్రాన్ని బయటపడటానికి కరెంట్ కోతలను చేసింది. రోజుకు ఆరు గంటలు కరెంట్ ను కట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఫిర్యాధులు కూడా రావడం తెలుస్తుంది..


గృహ, వ్యవసాయ వినియోగానికి ఆటంకాలు కలగకూడదనే పరిశ్రమల్లో విద్యుత్‌ వినియోగంపై ఆంక్షలు చేసినట్లు ప్రభుత్వం చెప్పింది.ప్రస్తుతం ఏపీలో 230 మిలియన్‌ యూనిట్ల మేర విద్యుత్‌ డిమాండ్‌ ఉందని పేర్కొన్నారు.ఏపీలో 180 మిలియన్‌ యూనిట్ల మేర విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతోందని,పరిశ్రమల్లో విద్యుత్‌ వినియోగంపై ఆంక్షల వల్ల 20 మిలియన్‌ యూనిట్ల మేర భారం తగ్గుతుందని విద్యుత్తు శాఖా అధికారులు అంటున్నారు..వేసవి లో కరెంట్ వినియోగం పెరగడం వల్ల మరో 30 మిలియన్‌ యూనిట్లను బహిరంగ మార్కెట్‌ నుంచి కొనుగోలు చేయాల్సి వస్తోందని అంటున్నారు.


ఈ నెల చివరి వారం నుంచి కరెంట్ ను అదనంగా కొనుగోలు చెస్తామని సదరు అధికారులు అంటూన్నారు. ఇప్పుడు ఎపి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో అత్యవసర పరిస్థితుల్లో తప్ప కరెంట్ ను కట్ చేయమని అన్నారు. అర్బన్‌లో అరగట సేపు విద్యుత్‌ కోతలు విధిస్తామని పేర్కొన్నారు. విద్యుత్‌ విషయంలో ఏపీలోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఇదే తరహా పరిస్థితి ఉందని, అందుకే థర్మల్ పవర్ ప్లాంట్ ను కొనసాగిస్తున్నామని అన్నారు. అయితే థర్మల్ కు బొగ్గు కొరత ఉండటం వల్ల విద్యుత్ కొరత ఏర్పడినది అంటున్నారు..బొగ్గును కూడా వేరే రాష్ట్రాల నుంచి కొనుగోలు చెస్తున్నట్లు అధికారులు అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: