కరోనా తర్వాత జనాలకు భద్రతా బాగా పెరిగింది.. ఎప్పుడూ ఉంటామో.. ఎప్పుడు పోతామో తెలియక చాలా మంది భద్రత కోసం ఇన్సూరెన్స్ పాలసీలను తీసుకుంటున్నారు.. ఇన్స్యూరెన్స్ పాలసీలు తీసుకోవాలని, వృద్ధాప్యం లో పెన్షన్ కోసం ఇప్పటి నుంచే పొదుపు చేయాలన్న ఆలోచన పెరుగుతోంది. అలాంటి వారికి ప్రభుత్వ రంగ దిగ్గజ ఇన్స్యూరెన్స్ సంస్థ అయిన లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేక పాలసీలను అందిస్తోంది.. ప్రత్యేకంగా పెన్షన్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. ఎల్ఐసీ సరళ్ పెన్షన్ ప్లాన్ పేరుతో ఓ పెన్షన్ పాలసీ ఉంది. ఈ పాలసీలో ఒకేసారి డబ్బులు చెల్లించాలి. ఏడాదికి రూ.50,000 పైనే పెన్షన్ లభిస్తుంది. 40 ఏళ్ల వయస్సు నుంచే పెన్షన్ తీసుకోవచ్చు. ఈ పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి..


వివరాల్లొకి వస్తే ఈ పాలసీని..40 ఏళ్ల నుంచి 80 ఏళ్లలోపు వారు ఈ పాలసీ తీసుకోవచ్చు. పాలసీ తీసుకున్న ఏడాది నుంచే యాన్యుటీ అంటే పెన్షన్ లభిస్తుంది. యాన్యుటీ కనీసం నెలకు రూ.1,000, మూడు నెలలకు రూ.3,000, ఆరు నెలలకు రూ.6,000, ఏడాదికి రూ.12,000 పొందొచ్చు..ఎంత యాన్యుటీ కావాలన్నదానిపై ఎంత ప్రీమియం చెల్లించాలన్నది ఆధారపడి ఉంటుంది. గరిష్టంగా ఎంతైనా ప్రీమియం చెల్లించవచ్చు. ఎల్ఐసీ సరళ్ పెన్షన్ ప్లాన్‌ను ఆఫ్‌లైన్‌లో అంటే ఎల్ఐసీ ఏజెంట్ల దగ్గర లేదా ఆన్‌లైన్‌లో ఎల్ఐసీ అధికారిక వెబ్‌సైట్‌లో తీసుకోవచ్చు. ఇందులో రెండు ఆప్షన్స్ ఉంటాయి..


మొదటి ఆప్షన్ ఎంచుకుంటే పాలసీ తీసుకున్న వ్యక్తి జీవించి ఉన్నన్ని రోజులు యాన్యుటీ వస్తుంది. వారు మరణించిన తర్వాత నామినీకి మొత్తం డబ్బులు వస్తాయి. రెండో ఆప్షన్‌లో పాలసీ తీసుకున్న వ్యక్తి జీవించి ఉన్నన్ని రోజులు యాన్యుటీ వస్తుంది. వారు మరణించిన తర్వాత జీవిత భాగస్వామికి యాన్యుటీ వస్తుంది..జీవిత భాగస్వామి కూడా మరణించిన తర్వాత నామినీకి డబ్బులు వస్తాయి. రెండో ఆప్షన్‌నే జాయింట్ యాన్యుటీ ఆప్షన్ అని కూడా అంటారు.

ఉదాహరణకు 60 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి రూ.10 లక్షల ప్రీమియం చెల్లించి ఏడాదికోసారి యాన్యుటీ తీసుకున్నారనుకుందాం. ఆపన్ష్ 1 ఎంచుకుంటే ఏడాదికి రూ.58,950 యాన్యుటీ వస్తుంది.జాయింట్ యాన్యుటీ ఆప్షన్ ఎంచుకుంటే పాలసీ తీసుకున్న వ్యక్తి జీవించి ఉన్నన్ని రోజులు ఏడాదికి రూ.58,250 చొప్పున యాన్యుటీ లభిస్తుంది. వారు మరణించిన తర్వాత జీవిత భాగస్వామికి కూడా ఏడాదికి రూ.58,250 యాన్యుటీ లభిస్తుంది. వారు కూడా మరణించిన తర్వాత నామినీకి రూ.10 లక్షలు వస్తాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: