ఏపీలో ప్రస్తుతం మూడు ముక్కలాట జరుగుతోంది. రాబోయే ఎన్నికలలో వైసీపీని దెబ్బ తీయడానికి అన్ని పార్టీలు తమ తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన కీలక పాత్ర పోషిస్తుందట. గత ఎన్నికల్లో అంతగా ప్రభావం చూపలేకపోయిన జనసేన ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని మద్దతును కూడగట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇదిలా ఉంటే రెండు రోజుల క్రితమే ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటనకు వచ్చారు. ఇందులో భాగంగా జనసేన అధినేత పవన్ ను కలవమని పీఎం ఆఫీస్ నుండి ఫోన్ రావడంతో.. పవన్ వెళ్లి మోదీని కలవడం జరిగింది.

అయితే వీరిద్దరూ లోపల దేని గురించి చర్చించుకున్నారు అన్నది బయటకు అయితే రాలేదు కానీ... మీడియా మిత్రులు మరియు రాజకీయ విశ్లేషకులు ఎవరికి నచ్చిన విధంగా వారు మాట్లాడుకుంటున్నారు. మోదీతో మీటింగ్ అనంతరం పవన్ మీడియా ముందు మాట్లాడిన తీరును బట్టి ఎవరికి తోచింది వారు రాసుకుంటున్నారు. ముఖ్యంగా రెండే రెండు విషయాలు హాట్ టాపిక్ గా నిలిచాయి. మోదీ పవన్ ను రెండే అంశాలను అడిగి ఉంటారని అందరూ ఊహిస్తున్నారు. మోదీ పవన్ ను ఇలా అడిగి ఉంటారని అంచనా ... జనసేనను బీజేపీలో విలీనం చేస్తావా ? లేదా 2024 ఎన్నికల్లో ఏపీలో మాతో కలిసి నడుస్తావా ? అయితే ఈ రెండు ప్రశ్నలకు కూడా సమాధానం దాదాపుగా ఒక్కటే ... కానీ ఇప్పటికే పవన్ చంద్రబాబు తో కలిసి ఎన్నికలకు వెళ్ళడానికి ప్లాన్ చేసుకుని ఉన్నారు.

మరి ఇటువంటి సమయంలో పవన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడు అన్నదానిపైనే జనసేన భవిష్యత్తు ఆధారపడి అది అని పలువురు అభిప్రాయపడుతున్నారు. మోదీ ఇలాంటి ప్రశ్నలు అడగడానికి కారణం ఇటీవల పవన్ ప్రవర్తించిన విధానమే అని చెప్పాలి. మీడియా సమావేశాలలో పార్టీ అధ్యక్షుడిగా ఉండి "చెప్పు" చూపించి మాట్లాడడం మరియు ఇప్పటం గ్రామం విజిట్ లో కారు మీద కూర్చుని హీరోలా ప్రవర్తించడం లాంటివి మోదీ దగ్గర లాక్ చేశాయి అని చెప్పాలి. పవన్ మోదీ అడిగిన విధంగా జనసేనను బీజేపీలో విలీనం చేస్తాడా ?


మరింత సమాచారం తెలుసుకోండి: