
అందరి విషయంలో ఇలాగే చేస్తే ఓకె... కానీ కొందరు దృష్టిలో మాత్రమే జగన్ స్వార్థపూరిత సీఎం అన్న పేరును తెచ్చుకుంటున్నారు. 2019 ఎన్నికల్లో 151 ఎమ్మెల్యే లను గెలిపించుకుని వైసీపీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. కానీ సరిగా రాజకీయ అనుభవం లేకనో... లేదా తన పూర్తి దృష్టిని పాలనపై ఉంచడమో తెలియదు... కానీ.. అందరికీ సమానంగా చూడడంలో , మరియు తగిన ప్రాధాన్యత ఇవ్వడంలో పూర్తిగా వెనుకబడ్డారు. అందువలన కొందరు ఎమ్మెల్యే లు జగన్ పై గుర్రుగా ఉన్నారు. రాష్ర్టంలో కానీ తమ తమ నియోజకవర్గాలలో కానీ మాకు గౌరవం మరియు విలువ లేకుండా చేస్తున్నారని ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.
పాలనలో భాగంగా జగన్ డైరెక్ట్ గా బటన్ నొక్కి సంక్షేమ పథకాలను ప్రజల ఖాతాల్లోకి పంపుతున్నారు. మరికొన్ని పథకాలను సచివాలయ వ్యవస్థ ద్వారా వచ్చిన వాలంటీర్లు ప్రజలకు అందజేస్తున్నారు. దీనితో ప్రజల దృష్టిలో అటు సీఎం జగన్ కు ఇటు వాలంటీర్లకు మరియు పార్టీకి మాత్రమే పేరు వస్తోంది.. కానీ ఎమ్మెల్యే మరియు ఎంపీలకు ప్రాధాన్యత కలగడం లేదు అంటూ కొందరు వాపోతున్నారు. ఇప్పుడు కొందరు ఎమ్మేల్యే లు డైరెక్ట్ గానే ప్రభుత్వం మరియు జగన్ పై విమర్శలు చేస్తూ అధిష్టానం దృష్టిలో హైలైట్ అవుతున్నారు. వారిలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీదర్ రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, మద్దిశెట్టి వేణుగోపాల్, రాచమల్లు ప్రసాద్ రెడ్డి మరియు వసంత కృష్ణప్రసాద్ లు ఉన్నారు. మరి వీరి ఆగ్రహం జగన్ ను ఇరుకున పెడుతుందా అసలు వీరితో సంప్రదించి తగిన పరిష్కారం ప్రభుత్వం చూపుతుందా చూడాలి.