మొత్తానికి ఎంఎల్ఏ బకరా అయిపోయారా ? అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. చంద్రబాబునాయుడును నమ్ముకుంటే అంతే సంగతులు అనేందుకు తాజా ఉదాహరణే ఉండవల్లి శ్రీదేవి అని అందరికీ అర్దమవుతోందా ? ఇంతకీ విషయం ఏమిటంటే అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉండాలని అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో దీక్షలు మొదలై 1200 రొజులు పూర్తయ్యాయి. దీక్షలో లేకపోతే పెయిడ్ దీక్షలో ఏదైనా కానీండి ఎల్లోమీడియాలో మాత్రమే దీక్షలు కనబడుతున్న విషయం నిజం. 

ఈ సందర్భంగా ప్రతిపక్షాలన్నీ కలిసి భారీఎత్తున సభ నిర్వహించాయి. టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన సభలో జనసేన, బీజేపీ, వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీల నేతలంతా పాల్గొన్నారు. సభకు ఎక్కడెక్కడినుండో నేతలంతా హాజరయ్యారు. మరింత పెద్దఎత్తున జరిగిన సభలో రాజధాని ప్రాంత ఎంఎల్ఏ ఉండవల్లి శ్రీదేవి ఎందుకని ఎక్కడా కనబడలేదు ? టీడీపీ ఎంఎల్సీ అభ్యర్ధికి క్రాస్ ఓటింగ్ చేశారని చెప్పి పార్టీ నుండి సస్పెండ్ చేసిన నలుగురు ఎంఎల్ఏల్లో శ్రీదేవి కూడా ఉన్నారు.

సస్పెన్షన్ వేటుపడిన తర్వాత ఎంఎల్ఏ మాట్లాడుతు తన హ్రుదయమంతా అమరావతి రాజధాని కోసమే పరితపిస్తున్నట్లు చెప్పుకున్నారు. అమరావతి ఉద్యమంలో తాను కూడా ముందుంటానని ప్రతిజ్ఞచేశారు. అమరావతి రాజధాని కోసం తాను పోరాటాలు చేస్తానన్నారు. మూడు రాజధానులు వద్దు..అమరావతే ముద్దంటు కుటుంబంతో కలిసి నినాదాలిచ్చిన శ్రీదేవి అంత పెద్ద సభలో ఎందుకని కనబడలేదు ? అన్నది పెద్ద ప్రశ్న.

అందుబాటులోని సమాచారం ప్రకారం అమరావతి జేఏసీ ఎంఎల్ఏని కలుపుకుని వెళ్ళటానికి ఇష్టపడలేదట. ఇక్కడ అమరావతి జేఏసీని వెనుకనుండి నడిపిస్తున్నది టీడీపీనే అని అందరికీ తెలుసు. ప్రొద్దుటూరు నుండి ఆదినారాయణరెడ్డిని, నెల్లూరు నుండి కోటంరెడ్డి శ్రీధరరెడ్డి, ఢిల్లీ నుండి సత్యకుమార్, రాజమండ్రి నుండి గుడుగురుద్రరాజు లాంటి వాళ్ళంతా సభలో కనిపిపించినపుడు లోకల్ ఎంఎల్ఏ శ్రీదేవి మాత్రమే కనిపించలేదంటేనే అర్ధమైపోతోంది టీడీపీ ఆమెను దూరంపెట్టేసిందని. ఓటు  వేయించుకుని తనను వదిలేసిన విషయం ఎంఎల్ఏ శ్రీదేవికి ఇప్పటికైనా అర్ధమైందా ?


మరింత సమాచారం తెలుసుకోండి: