గంటా శ్రీనివాస్ రాజీనామా చేసిన తర్వాతే వైసీపీలో చేరాలని ఆ పార్టీ నేతలు కండిషన్ పెడుతున్నట్టు తెలుస్తోంది. మిగతావారిలాగా తమకు సంబంధించినవారిని తీసుకొచ్చి వైసీపీలో చేర్పించి, తాము పక్కన ఉండి తతంగం నడిపించాలంటే కుదరదని అంటున్నారు. అయితే గంటా రాజీనామా చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయనే ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్నారు. ఒకవేళ గంటా రాజీనామా చేస్తే, వచ్చే ఎన్నికల్లో ఆయనకే వైసీపీ టికెట్ ఇస్తారా, ఇస్తే ఆయనే గెలుస్తారా అనే విషయం తేలాల్సి ఉంది.