అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి కరోనా సోకిన తర్వాత వైట్ హౌస్ లోనే చికిత్స అందించినా తర్వాత ప్రత్యేక హెలికాప్టర్లో వాల్టర్ రీడ్ సైనిక ఆసుపత్రికి తరలించారు. ట్రంప్ కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందో స్పష్టంగా చెప్పలేమని, డిశ్ఛార్జి అయ్యేందుకు కొన్ని రోజుల సమయం పడుతుందని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమయినా రాబోయే 48గంటలు మాత్రం చాలా కీలకం అంటున్నారు.