ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీకి ముందు.. ఎన్డీఏలో వైసీపీ చేరడం గ్యారెంటీ అనుకున్నారు. ఓ కేబినెట్ పదవి, మరో రెండు సహాయ మంత్రి పదువులు దక్కుతాయని కూడా లెక్కలు కట్టారు. అయితే తీరా ప్రధానితో సీఎం జగన్ భేటీ పూర్తయిన తర్వాత మాత్రం ఎలాంటి ప్రకటనలు రాలేదు. మంత్రి పదవుల విషయంలో ఎన్డీఏ ఆఫర్ సంతృప్తిగా లేకపోవడం వల్లే మరోదఫా చర్చలు జరిగే అవకాశముందని చెబుతున్నారు.