దేశవ్యాప్తంగా అధిక వర్షాలకు పంట దెబ్బతినడంతో ఉల్లి ధరలు మండిపోతున్నాయి. రిటైల్ మార్కెట్లలో కిలో రూ.90 నుంచి రూ.100 వరకు అమ్మకాలు జరిగాయి. ఈ ధరలు మరింత పెరిగే అవకాశాలుండటంతో రాష్ట్ర ప్రభుత్వం హోల్సేల్ మార్కెట్లో ఉల్లిపాయలు కొనుగోలు చేసి రైతుబజార్లలో సబ్సిడీ ధరకు విక్రయించాలని నిర్ణయించింది. రైతుబజార్లలో కిలో రూ.40కి అమ్మాలని నిర్ణయించింది. తొలి దశలో రాష్ట్రంలోని నగరాలు, ముఖ్య పట్టాణాల్లోని రైతు బజార్లలో ఇలా సబ్సిడీ ఉల్లిపాయలు అమ్ముతారు.