ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద పేదలకు పంపిణీ చేస్తున్న ఉచిత బియ్యం గడువు నవంబర్ తో ముగుస్తుండగా.. దాన్ని మార్చి వరకు పొడిగించే నిర్ణయం త్వరలోనే కేంద్రం తీసుకుంటోంది. ఉచిత బియ్యం పంపిణీ కొనసాగించాలంటూ వివిధ రాష్ట్రాలు కేంద్రాన్ని కోరడం వల్లే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అందులోనూ వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఇటీవలే మొదలయ్యాయి. రాజకీయ కోణంలో కూడా ఉచిత బియ్యం పంపిణీ తమకు లాభంగానే భావిస్తోంది కేంద్రలో అధికారంలో ఉన్న బీజేపీ.