డాక్టర్ల తాజా బులిటెన్ ప్రకారం రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఆయన క్రమంగా కోలుకుంటున్నారు. ఐసీయూలో ఉన్న ఆయనకు హై ఫ్లో ఆక్సిజన్ అందిస్తున్నారు. వైద్యనిపుణుల బృందం ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షిస్తున్నట్టు వైద్య బృందం వివరించింది.