గవర్నమెంట్ సర్వీస్ లో ఉన్నవాళ్లెవరూ సినిమాల్లో, టీవీ సీరియల్స్ లో నటించకూడదంటూ కర్ణాటక ప్రభుత్వం ఓ కొత్త నిబంధన తెరపైకి తెచ్చింది. కర్ణాటక స్టేట్ సివిల్ సర్వీసెస్ ప్రవర్తనా నిబంధనలు 2020 ముసాయిదా ప్రకారం.. ఇకపై ప్రభుత్వ ఉద్యోగులెవరూ సినిమాల్లో, సీరియళ్లలో నటించడానికి కుదరదు. నటనతోపాటు రచనా సాంగత్యాన్ని కూడా వాళ్లు వదులుకోవాల్సిందేనట. పుస్తకాలు సైతం ప్రచురించకూడదని కర్నాటక ప్రభుత్వం వింత నియమాన్ని పెట్టింది.