రెండు తెలుగు రాష్ట్రాల ఆర్టీసీలు బస్సులు నడిపేందుకు సిద్ధపడిన సమయంలో.. ఆర్టీసీ చార్జీల పెంపు అనివార్యంగా మారింది. ఇప్పటి వరకూ తెలుగు రాష్ట్రాల మధ్య చార్జీల్లో స్వల్ప వ్యత్యాసం ఉంది. తెలంగాణ ఆర్టీసీ టికెట్ రేటు కంటే ఏపీఎస్ఆర్టీసీ టికెట్ రేటు తక్కువ. ఇప్పుడు నష్టాన్ని పూడ్చుకోడానికి ఏపీ కూడా రేట్లు పెంచేందుకు సిద్ధపడింది. అందులోనూ.. లాక్ డౌన్ తర్వాత తెలియకుండానే ఆర్టీసీ టికెట్ రేట్లను పెంచేసింది. 50శాతం సీటింగ్ కెపాసిటీ అనే వంకతో సర్దుబాటు చేసిన రేట్లను ఇప్పుడు 100శాతం సీట్లతో నడుపుతున్నా తగ్గించలేదు. దీంతో ప్రయాణికుల జేబులకు భారీగానే చిల్లు పడుతోంది.