ఓటరూ మేలుకో, నీ ఓటు హక్కు వినియోగించుకో అంటూ కొన్ని రోజులుగా సినీ నటులు సోషల్ మీడియాలో హోరెత్తించారు. మన ఓటు హక్కు మనం కచ్చితంగా వినియోగించుకోవాలని లేకపోతే మనం ప్రజాస్వామ్యానికి విలువ ఇచ్చినవాళ్లం కాదంటూ.. నటీనటులు, టెక్నీషియన్ల చేత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విపరీతంగా ఓటు హక్కుపై ప్రచారం చేయించింది. కొంతమంది స్వచ్ఛందంగా సోషల్ మీడియాలో తమ సందేశాన్ని ఉంచారు. మరి వీరందరి ఉపదేశాలు ఏమైనట్టు? సినీ నటుల సందేశాలు వినేవారు పోలింగ్ బూత్ లకు ఎందుకు రాలేదు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం దారుణంగా ఎందుకు పడిపోయింది?