తిరుపతి ఉప ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టడంకోసం బీజేపీ, జనసేన ఏర్పాటు చేసుకున్న సంయుక్త సమావేశంలో ఏ విషయం తేలలేదు. తిరుపతి ఎన్నికల్లో రెండు పార్టీలు తమ అభ్యర్థినే నిలబెట్టాలనే పంతంతో ఉన్నాయి. అయితే పొత్తు ధర్మం ప్రకారం ఇక్కడ ఒకే పార్టీ పోటీ చేయాలి. ఆ పార్టీ ఏదనే విషయంపైనే చర్చోప చర్చలు జరుగుతున్నాయి. తాజాగా హైదరాబాద్ లో జరిగిన చర్చల్లో కూడా ఫలితం తేలలేదు.