కొవిడ్ టీకా ఇంకా వినియోగంలోకి రాక ముందే.. దాని నిల్వ, సరఫరా వంటి విషయాలపై రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర స్థాయిలో కసరత్తులు చేస్తున్నాయి. అవసరమైతే టీకా కార్యక్రమం కోసం తాత్కాలిక ఉద్యోగాలు భర్తీ చేసేందుకు సైతం తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. టీకా కార్యక్రమం దీర్ఘ కాలిక ప్రక్రియ కాబట్టి.. తెలంగాణలో నిరుద్యోగులకు ఇది కచ్చితంగా శుభవార్తేనని చెప్పాలి.