తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అన్ని డిపార్ట్ మెంట్ల అధికారులు ముందస్తు సన్నాహాలు ప్రారంభించారు. ఖాళీలు, వాటి వివరాలు సేకరించి.. నియామకాల నోటిఫికేషన్లు జారీ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. అయితే అందరికంటే ముందు పోలీస్ డిపార్ట్ మెంట్ నుంచి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలున్నాయి.