రజినీకాంత్ రాజకీయ పార్టీపై వెనక్కి తగ్గారు. అనారోగ్య కారణాన్ని చూపుతూ ఆయన పార్టీ ప్రకటించడంలేదని, ప్రజా సేవలోనే ఉంటానని స్పష్టం చేశారు. అయితే ఆయన పార్టీ పెట్టకపోవడం వెనక కుటుంబ సభ్యుల ఒత్తిడి ఉందనేది అందరికీ తెలిసిన విషయమే. రాజకీయాల్లోకి రావొద్దని, ఆరోగ్య సమస్యలు పెద్దవి చేసుకోవద్దని ఇద్దరు కుమార్తెలు రజినీపై తీవ్ర ఒత్తిడి తెచ్చారని అంటారు. కానీ కుటుంబ సభ్యులతోపాటు, బీజేపీ నేతల ఒత్తిడి కూడా ఆయనపై ఉందనే పుకార్లు ఇప్పుడు షికారు చేస్తున్నాయి.