నెల్లూరు జిల్లాలో ఓ పంచాయతీ ఉంది. ఆ పంచాయతీ ప్రజలకు ఎన్నికలంటే ఇష్టం లేదు. ఎప్పుడూ ఏకగ్రీవానికే మొగ్గు చూపుతారు. ఆ పంచాయతీ ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకూ ఒకే ఒక్కసారి మాత్రమే ఎన్నిక జరిగింది. అప్పుడూ, ఇప్పుడూ ఎప్పుడూ అక్కడ ఏకగ్రీవమే. ఆ పంచాయతీ పేరే తోడేరు. పొదలకూరు మండలంలో ఆ పంచాయతీ ఉంది.