నెల్లూరు జిల్లా పర్యటనకు ఎస్ఈసీ నిమ్మగడ్డ వచ్చి వెళ్లిన గంటల వ్యవధిలోనే.. అక్కడ వైసీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడ్డారు. బీజేపీ మహిళా అభ్యర్థిని నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారు. సంగం మండలం సిద్ధీపురం పంచాయతీకి నామినేషన్ వేసేందుకు వచ్చిన మహిళా అభ్యర్థి నామినేషన్ పత్రాలు కొంతమంది లాక్కెళ్లిపోయారు. దీంతో ఆవిడ మరో సెట్ నామినేషన్ సిద్దం చేసుకుని పంచాయతీ కార్యాలయంలోకి వెళ్లే క్రమంలో వైసీపీ నేతలు అడ్డు తగిలారు. దీంతో ఆమె నామినేషన్ వేయకుండానే వెనుదిరగాల్సిన పరిస్థితి..