నాగార్జున సాగర్ రచ్చ మొదలైంది. నోటిఫికేషన్ కంటే ముందే ఉప ఎన్నికల వేడి రాజుకుంది. ఇటీవల నల్గొండ జిల్లా హాలియాలో జరిగిన సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై నాగార్జున సాగర్ లో కాంగ్రెస్ తరపున పోటీకి దిగబోతున్న జానారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. సాగర్ ఉప ఎన్నికల్లో లబ్ధిపొందేందుకే కేసీఆర్ అలాంటి మాటలు మాట్లాడుతున్నారని చెప్పారు. ఆరు నూరైనా సాగర్ లో గెలుపు కాంగ్రెస్ దేనని అన్నారు జానా రెడ్డి.