పురపాలక సంస్థల ఎన్నికలు తిరిగి మొదలవుతున్న నేపథ్యంలో.. ఎన్నికల కమిషన్ ప్రకటన వచ్చిన రోజే సీఎం జగన్ పట్టణ ప్రాంత ప్రజలకు శుభవార్త చెప్పారు. అయితే సీఎం జగన్ సమీక్ష ముందుగానే నిర్ణయించుకున్నది కావడంతో ఇది కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందా లేదా అనేది తేలాల్సి ఉంది. నగరాలు, పట్టణాల్లోని పేదలు, మధ్య తరగతి ప్రజల సొంతింటి కల నెరవేర్చేందుకు తక్కువ ధరకే ఇళ్ల స్థలాలు పంపిణీ చేసే కార్యక్రమంపై జగన్ మరిన్ని సూచనలు చేశారు. లాభాపేక్షలేకుండా నిర్ణీత ధరలకే ఇళ్ల స్థలాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు జగన్.