ఇప్పటి వరకూ కొవిడ్ వారియర్స్ కి టీకా అందించాయి ప్రభుత్వాలు. తొలి విడత లో వైద్య సిబ్బందికి, మలి విడతలో రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ సిబ్బందికి ఇస్తున్నారు. వీరికి రెండో దఫా టీకా పంపిణీ కూడా మొదలైంది. కొవిడ్ వారియర్స్ కి రెండు డోసులు పూర్తయిన తర్వాత సామాన్య ప్రజలకు టీకా ఇస్తామని గతంలోనే ప్రభుత్వం ప్రకటించింది. అయితే వారిలో 50ఏళ్లు పైబడినవారికి, దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి ఫస్ట్ ప్రయారిటీ అంటున్నారు. అయితే ఇప్పటి వరకూ దీనిపై స్పష్టత లేదు. ఎప్పటినుంచి వ్యాక్సినేషన్ ఇస్తారనే విషయంపై ఇటీవలే ప్రభుత్వం చర్చలు మొదలు పెట్టింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే మార్చి రెండో వారం నుంచి సాధారణ పౌరులకు అంటే 50ఏళ్లు పైబడినవారికి టీకా పంపిణీ మొదలవుతుందననమాట.