ఎట్టకేలకు చంద్రబాబు కుప్పం వచ్చారు. తన నియోజకవర్గ ప్రజల్ని కలిసి పంచాయతీ ఎన్నికల ఫలితాలపై ఆరా తీశారు. అధైర్య పడొద్దని చెప్పారు, వైసీపీ ప్రభుత్వం ఎన్నోరోజులు ఉండదని, మళ్లీ మన ప్రభుత్వం వస్తుందని ధైర్యం చెప్పారు. అయితే ఇప్పుడే సడన్ గా చంద్రబాబుకి ఎందుకు కుప్పం గుర్తొచ్చింది, కుప్పం కష్టాలు ఎందుకు గుర్తొచ్చాయంటే.. దానికి సీఎం జగనే కారణం అని చెప్పాలి. కరోనా కష్టకాలం తర్వాత ఇప్పటి వరకూ చంద్రబాబు కుప్పం వైపు కన్నెత్తి చూడలేదు. ఏ మీటింగ్ అయినా జూమ్ లోనే ముగించేవారు. అలాంటిది చంద్రబాబు కుప్పం తిరిగి వచ్చే సరికి అక్కడి ప్రజలు దానికి కారకుడైన జగన్ కి ధన్యవాదాలు చెపుతున్నారని నెట్టింట్లో జోకులు పేలుతున్నాయి.