మున్సిపల్ ఎన్నికల వ్యవహారంతో విశాఖ రాజకీయం వేడెక్కింది. చంద్రబాబు, నారా లోకేష్ సహా కీలక నేతలంతా విశాఖ కేంద్రంగా రాజకీయాలు మొదలు పెట్టారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రధాన అంశం కాగా.. విశాఖలో కబ్జా బాగోతం అంటూ ఇటీవల చంద్రబాబు, అధికార పార్టీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. కబ్జా రాయుళ్ళని విశాఖకు దూరంగా ఉంచాలని అన్నారు. దీంతో వైసీపీ కూడా అదే స్థాయిలో విరుచుకుపడుతోంది. విశాఖలో అసలైన అభివృద్ధి జరిగింది వైఎస్ఆర్ హయాంలో అని.. అవినీతి మాత్రం టీడీపీ హయాంలో జరిగిందని అంటున్నారు.