ఏపీలో మున్సిపల్ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు అధికారులు. ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి.. ప్రచారం పూర్తయిన తర్వాత మరికొన్నిటిని కూడా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో చేర్చారు. రేపు జరగబోతున్న పుర ఎన్నికల్లో మొత్తం రాష్ట్రంలో ఉన్న పోలింగ్ కేంద్రాల్లో 60.49% కేంద్రాలు సమస్యాత్మకంగా గుర్తించారు.