యూట్యూబ్ ఛానెల్ పెట్టి దాని ద్వారా ఆదాయం సంపాదించే సులభతర మార్గాన్ని ఇటీవల చాలామంది ఫాలో అవుతున్నారు. తమ సృజనాత్మకతకు పదును పెట్టి చిన్న చిన్న వీడియోలు చేసి వాటిని యూట్యూబ్ లో అప్ లోడ్ చేసి ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. అయితే ఇకపై ఇలాంటి వ్యవహారాలకు కూడా దేశాల వారీగా పన్ను చెల్లించే రోజులు వచ్చేశాయి. యూట్యూబ్ చానల్ ద్వారా సంపాదించే సొమ్ముకు అమెరికాలో పన్ను కట్టాల్సిందే నంటూ గూగుల్ సంస్థ కొత్త విధానం తీసుకొచ్చింది. అయితే ప్రస్తుతానికి ఈ పన్ను కేవలం అమెరికన్ వీక్షకుల నుంచి వచ్చే ఆదాయంపైనే ఉంటుంది.