పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ టీవీల్లో కనిపించారంటే ఏదో ఒక ఉపద్రవం ముంచుకొచ్చినట్టేనని సెటైర్లు పేలాయి. లాక్ డౌన్ నిర్ణయాన్ని కూడా అలాగే ప్రకటించారు మోదీ. ఇప్పుడు మరోసారి ఆయన టీవీలముందుకు రాబోతున్నారు. దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ మొదలైన వేళ, అన్ని రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్న వేళ.. ప్రధాని కీలక సందేశం మోసుకొస్తున్నారనే వార్తలొస్తున్నాయి. మరి ఈసారి మోదీ ఏం చెబుతారు..? దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఉంటుందా..? ఉంటే ఎప్పట్నుంచి? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.