తొలి దశ కరోనాను గుర్తించిన వెంటనే స్కూల్స్, కాలేజీలు, అన్నీ మూసివేయడంతో.. ఎక్కడా విద్యార్థులు కరోనా బారిన పడినట్టు ఆధారాలు లేవు. ఇప్పుడు సెకండ్ వేవ్ మొదలైన తర్వాత స్కూళ్లకు స్కూళ్లే కరోనాతో మూతపడుతున్నాయి. గుంటూరు జిల్లా పొన్నూరులో ఓ ప్రైవేట్ స్కూల్ విద్యార్థులకు కరోనా సోకడంతో దాన్ని మూసివేశారు. స్కూల్ ని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించి శానిటైజ్ చేయించారు.