తిరుపతి ఉప ఎన్నికల వ్యూహాలు రచించడం మొదలు పెట్టిన చంద్రబాబు ఐదుగురు సభ్యులతో ఎన్నికలకోటం ఓ టీమ్ ఏర్పాటు చేశారు. నారా లోకేష్, అచ్చెన్నాయుడు, పనబాక కృష్ణయ్య, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బీదా రవిచంద్ర.. వీరితో ఓ సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి, తిరుపతి ఉప ఎన్నికల వ్యవహారాలు అప్పగించారు. పార్లమెంట్ నియోజకవర్గాన్ని 75 క్లస్టర్లుగా ఏర్పాటు చేసి, ప్రతి క్లస్టర్ కి ఓ కార్యాలయం ఏర్పాటు చేసి మరీ పోలింగ్ కి సిద్ధం కావాలని సూచించారు.