కొవిడ్ టైమ్ లో తిరుమల సహా అన్ని ఆలయాలకు మూతపడింది. భక్తులు లేకుండానే స్వామివార్ల కైంకర్యాలు పూర్తి చేసేవారు పూజారులు. తిరిగి అంతా సాధారణ పరిస్థితికి చేరుకున్న సమయంలో తిరుమల ఆలయంలో కూడా అన్ని జాగ్రత్తలతో తిరిగి భక్తుల దర్శనానికి అనుమతులిచ్చారు. అయితే సెకండ్ వేవ్ ప్రభావం తిరుమల కొండపై కూడా పడింది. చిత్తూరు జిల్లాలో కేసుల సంఖ్య భారీగా పెరగడంతో తిరుమల యాత్రికులపై ఆంక్షలు విధించారు అధికారులు.