ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో కీలక మార్పులు జరగబోతున్నాయంటున్న వేళ.. కేంద్రం ఆ దిశగా సంకేతాలిచ్చింది. అయితే యోగి ఆదిత్యనాథ్ కుర్చీకి మాత్రం ప్రస్తుతానికి వచ్చిన ప్రమాదమేం లేదు. అదే సమయంలో ప్రధాని నరేంద్రమోదీ సన్నిహితుడు ఏకే శర్మను ఉప ముఖ్యమంత్రిగా కేబినెట్ లోకి తీసుకుంటున్నారని తెలుస్తోంది. గుజరాత్ కేడర్ కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి శర్మ ప్రధాని మోదీతో 20ఏళ్లపాటు కలసి పనిచేశారు. ఆయనకు వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చి మరీ ఎమ్మెల్సీని చేశారు మోదీ. ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలనే ప్రతిపాదన గతంలోనే ఉంది. అయితే శర్మ మరో పవర్ సెంటర్ గా మారతారనే భయంతో యోగి మంత్రి వర్గ విస్తరణకు వెనకడుగు వేశారు. ఇప్పుడు అధిష్టానం జోక్యం చేసుకుని ఆ లాంఛనం పూర్తి చేస్తోంది.